7 మే 2019న,ఆచార్య ఆత్రేయ 98 వ జయంతిని పురస్కరించుకొని ఆత్రేయ అభిమానుల కొరకు ఆత్రేయ సాహితీ స్రవంతి స్థాపకులు, ఆత్రేయ సాహితీ పరిశోధకులు డా తలతోటి పృథ్వి రాజ్ అను నేను రూపొందించిన ఈ ఆడియోని విని ఆనందించగలరని  ఆశిస్తున్నాను . క్రింది ఆడియో ఫైల్ ని ఆన్ చేసి వినండి .

ATHREYA SAHITHI SRAVANTHI-www.litt.in

ఆత్రేయ సాహితీ స్రవంతి లక్ష్యాలు

 

     తెలుగు సినిమా పాటకూ,మాటకూ విజ్ఞాన సర్వస్వం  వంటివారు ఆచార్య ఆత్రేయ. ఎందరో సినీ కవులకు స్ఫూర్తి,మార్గదర్శకులు ఆత్రేయ. అటువంటి గొప్ప కవిపై ఆమూలాగ్రంగా పరిశోధన చేసినవాడిని నేను. తెలుగు సినీ సాహిత్య పరిశోధనలో సినిమా సంభాషణలపై జరిగిన తొలి పరిశోదన నాది. ఆత్రేయ సినిమా సంభాషణలు – ఒక పరిశీలన” అనే అంశంపై నేను పరిశోధన చేసి 2000 సంవత్సరంలో నా సిద్ధాంత గ్రంధాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయం వారికి సమర్పించి నాటి గవర్నర్ డా.రంగరాజన్ గారి చేతుల మీదుగా పిహెచ్.డి.పట్టాను స్వీకరించాను. ప్రత్యేకించి ఒక నాటక రచయిత సంభాషణలకు సంబంధించి వచ్చిన పరిశోధనా గ్రంధంకూడా నాదే.  ఆత్రేయ నాటక సాహిత్యం పైగల వ్యక్తిగత ఆసక్తినిబట్టి ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు”అనే అంశంపై పరిశోధించి 1999  లో నేను దానిని గ్రంధరూపంలోకి తీసుకు వచ్చాను. ఆత్రేయ గారి సినిమా పాటలపై మనసుకవి”అనే మరో పుస్తకాన్ని కూడా రచించి ఆత్రేయ అభిమానులకు అందించాను.ఆత్రేయగారి అభిమానుల కొరకు ఆత్రేయ గారి 151 ప్రసిద్ధ సినీగీతాలతో కూడిన ఆత్రేయ ఆణిముత్యాలు” అనే mp3 audio c.d. ని నేను తీసుకువచ్చాను. ఆత్రేయ మొదటి,చివరి పాటలే కాక సూపర్ హిట్ సాంగ్స్ ఇందులో పొందుపరిచాను. ఆత్రేయగారి సాహిత్యం,వ్యక్తిత్వానికి సంబంధించి పద్మావతి ఆత్రేయ,ఆకెళ్ళ,జె.కె.భారవి,డి.వి.నరసరాజు,గొల్లపూడి మారుతీరావు,బొల్లిముంత శివరామకృష్ణ,డా.డి.రామానాయుడు,కాశీవిశ్వనాథ్,తనికెళ్ళ భరణి వంటి ప్రముఖుల ఇంటర్వ్యూలను ఆత్రేయ సాహిత్యం – వ్యక్తిత్వం” పేరుతో ఆడియో సి.డీ. గా రూపొందించాను. స్కాలర్ గా ఉన్న రోజుల్లోనే ఆత్రేయ జీవితం, సాహిత్యం పై మహాకవి ఆత్రేయ” అనే డాక్యుమెంటరీ వీడియో సి.డీ.ని రూపొందించాను. ఆతర్వాత ఆత్రేయ సినిమా పాటలు”,”సంభాషణా చాణుక్యుడు ఆత్రేయ”అనే వీడియో సి.డీ.లనుకూడా నేను రూపొందించడం జరిగింది.

    2004 మే 7 వ తేదీన ఆచార్య ఆత్రేయ 83 వ జయంతిని పురస్కరించుకొని ఆత్రేయ సాహితీ స్రవంతి” అనే సంస్థ ని ఇండియన్ హైకు క్లబ్ అనుబంధ సంస్థగా నేను స్థాపించాను.2004 వ సంవత్సరానికిగాను ఆత్రేయ సాహితీ స్రవంతి గౌరవ సలహాదారులుగా శ్రీమతి పద్మావతి ఆత్రేయ, రసరాజు గార్లు వ్యవహరించారు. సాయి కుల్వంత్ కళాశాలల కరస్పాండెంట్ శ్రీ ఎమ్.కామరాజు డిజిటల్ బ్యానర్ ను ఆవిష్కరించారు. తొలి కార్యక్రమాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్  డా.విజయలక్ష్మీ గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

     ప్రతి సంవత్సరం ఆత్రేయ జయంతి,వర్థంతి సభలను నిర్వహించడమే గాక ప్రముఖ తెలుగు సినీ రచయితల సినీ సాహిత్యంపై కూడా ఈ సంస్థ సాహితీ కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనతో వేటూరి సంస్మరణ సభను,ఆరుద్ర,దాశరధి సభలను నిర్వహించింది. ప్రతి సంవత్సరం విడుదలైన తెలుగు చిత్రాలలోని సంభాషణలను, పాటలను, కథలను పరిశీలించి ఉత్తమ గేయ రచయిత,ఉత్తమ మాటల రచయిత,ఉత్తమ కథా రచయిత ల అవార్డ్ లను ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రకటించి ప్రశంసా పత్రంతో, సన్మాన – సత్కారాలతో విజేతలను తగురీతిగా గౌరవించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. సినీ పరిశ్రమకు ఉత్తమ సాహిత్యాన్ని అందించినవారికి సంస్థ ఆత్రేయ సాహితీ పురస్కారం”ను ప్రదానం చేస్తోంది. సినీ రచయితగా విశిష్ట సేవలందిస్తున్న వారికి ఆత్రేయ సాహితీ స్రవంతి బిరుదు ప్రదానం చేస్తోంది.

     2006 మే 7 వ తేదీ , ఆత్రేయ 85 వ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ జాలాది గారికి జానపద గేయ శిరోమణి”బిరుదును ప్రదానం చేసింది. 13 సెప్టెంబర్ 2006 ఆత్రేయ గారి 17 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆత్రేయ శిష్యులు శ్రీ గురుచరణ్ గారికి ఆత్రేయ సాహితీ పురస్కారం”ను ప్రదానం చేసింది ఆత్రేయ సాహితీ స్రవంతి.                                    

01 ACHARYA ATHREY 83rd JAYANTHI SABHA 7-5-2004-www.litt.in

పృథ్విరాజ్ రచించిన “మన ‘సు’కవి “వ్యాస సంపుటిని మే 7,2004 న  ప్రముఖ గైనకాలజిస్ట్ డా .విజయ లక్ష్మి గారు ఆవిష్కరిస్తున్న దృశ్యం. చిత్రంలో  తెలుగు అధ్యాపకులు రామసత్యనారాయణ , కొణుతుల నారాయణరావు,రచయిత తలతోటి పృథ్వి రాజ్  

02 ACHARYA ATHREYA 15th VARDHANTHI SABHA-13-9-2004-www.litt.in

13 సెప్టెంబర్ 2004న  ఆత్రేయ 15 వ వర్ధంతిని నిర్వహిస్తున్న ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు. ఆత్రేయ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రముఖ కథకులు శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం .

03 ACHARYA ATHREYA 84th JAYANTHI SABHA-7-5-2005-www.litt.in

మే 5 , 2005 ఆత్రేయ 84 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు. ఆత్రేయ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రముఖ సంఘ సేవకులు శ్రీ రాపర్తి జగదీష్ గారు 

04 ACHARYA ATHREYA 16th VARDHANTHI SABHA-13-9-2005-www.litt.in

19 సెప్టెంబర్ 2005 ఆత్రేయ 16 వ వర్థంతి సమావేశం బషో కాన్ఫరెన్స్ హల్లో జరిగింది . డా మళ్ళ రామ అప్పారావు ,భమిడిపాటి ప్రసాదరావు , వేప పార్వతీశం ఇవటూరి నందికేశ్వర రావు మొదలగువారు పాల్గొన్నారు   

07 ACHARYA ATHREYA 86th JAYANTHI SABHA-7-5-2007-www.litt.in
 ఆత్రేయ 85వ జయంతి సమావేశం 7 మే 2007 న అనకాపల్లి లోని   విజయా రెసిడెన్సీ లో   జరిగింది. సంభాషణ చాణుక్యుడు ఆత్రేయ అనే అంశంపై పృథ్విరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.శ్రీ రాపర్తి జగదీశ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు . శ్రీ పి లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
10 VETURI SUNDARARAMA MURTHY SAMSMARANA SABHA-28-5-2010-www.litt.in
 ప్రముఖ సినీకవి వేటూరి ఆకస్మిక మరణం సందర్భంగా ఆత్రేయ సాహితీ స్రవంతి సంస్థ వేటూరి సంస్మరణ సమావేశాన్ని 28  మే 2010న అనకాపల్లి లోని   విజయా రెసిడెన్సీ లో   నిర్వహించింది.  శ్రీ గూటూరి  వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా, వక్తగా పాల్గొని ప్రసంగించారు.  
13 ACHARYA ATHREYA 24th VARTHANTHI-13-9-2013-www.litt.in
 ఆత్రేయ 24వ వర్ధంతి సమావేశం 13 సెప్టెంబర్ 2013 న అనకాపల్లి లోని గాయత్రి మోడల్ స్కూల్లో జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ కమలాకర రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బల్లా నాగభూషణం, మురళీకృష్ణ ,గట్టి బ్రహ్మాజీ ,సన్నికంటి ,జి రంగబాబు, డా యి. చక్రపాణి  పాల్గొన్నారు
16 ACHARYA ATHREYA 25th VARTHANTHI-13-9-2014-www.litt.in
 ఆత్రేయ 25 వ వర్ధంతి కార్యక్రమం 13 సెప్టెంబర్ఆ 2014న అనకాపల్లి లోని బి.ఎం.ఎల్. స్కూల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో బి చిన్నారావు, గట్టి బ్రహ్మాజీ ,సన్నికంటి ,జి రంగబాబు,డా యిమ్మిడిశెట్టి చక్రపాణి,  ఇవటూరి గౌరీశం,తాడి చక్రవర్తి  మొదగువారు పాల్గొన్నారు 
19 ACHARYA ATHREYA 26th VARDHANTHI SABHA-13-9-2015-www.litt.in
 ఆత్రేయ 26వ వర్ధంతి సమావేశం 19 సెప్టెంబర్ 2015 న అనకాపల్లి లోని ఒక గృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు జి రంగబాబు , బ్రహ్మాజీ, తెలుగు టీచర్, బ్యాంక్ ఉద్యోగి కొడుకుల జగన్నాథ రావు మొదలగువారు పాల్గొన్నారు. పృథ్విరాజ్ రూపొందించిన సి డి ఆవిష్కరించారు. 
05 ACHARYA ATHREYA 85th JAYANTHI SABHA-7-5-2006-www.litt.in

ఆత్రేయ 85వ జయంతి సమావేశం 7 మే 2006 న అనకాపల్లి లోని   వై ఎం వి ఎ హల్లో   జరిగింది. సినీకవి జాలదికి జానపద గేయ శిరోమణి బిరుదుతో ఘనంగా సత్కరించడం జరిగింది .శ్రీ రాపర్తి జగదీశ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. సంస్థ సభ్యులు గట్టి బ్రహ్మాజీ , జి రంగబాబు భమిడిపాటి పాల్గొన్నారు .

08 ACHARYA ATHREYA 18th VARDHANTHI SABHA-13-9-2007-www.litt.in
 19 సెప్టెంబర్ 2007  ఆత్రేయ 18వ వర్థంతి సమావేశం బషో కాన్ఫరెన్స్ హల్లో జరిగింది . ఈ కార్యక్రమంలో భమిడిపాటి ప్రసాదరావు , వేప పార్వతీశం,డా ఎస్ హనుమంతరావు, గట్టి బ్రహ్మాజీ , జి రంగబాబు,సనారా,అమరజ్యోతి, ఎల్ ఎస్ ఆర్ శాస్త్రి మొదలగువారు  పాల్గొన్నారు .
11 ACHARYA ATHREYA 92nd JAYANTHI SABHA 7-5-2012-www.litt.in
  ఆత్రేయ 92వ జయంతి సమావేశం 7 మే 2012 న అనకాపల్లి లోని   శాఖా గ్రంధాలయంలో  జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది , ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు దివాకర రావు, జి రంగబాబు ,డా యిమ్మిడిశెట్టి చక్రపాణి , బ్రహ్మాజీ మొదలగువారు పాల్గొన్నారు. 
14 CINEMA LYRICIST JALADI RAJA RAO 82nd BIRTH ANNIVERSARY MEETING-9-8-2014-www.litt.in
   సుప్రసిద్ధ సినీకవి జాలాది 82వ జయంతి కార్యక్రమం 9 ఆగస్ట్ 2014న అనకాపల్లి లోని బి.ఎం.ఎల్. స్కూల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్  సాయి,కామేశ్వర రావు,గట్టి బ్రహ్మాజీ ,సన్నికంటి ,జి రంగబాబు, ఇవటూరి గౌరీశం మొదగువారు పాల్గొన్నారు
17 VETURI SUNDARARAMA MURTHY 79th JAYANTHI-29-1-2015-www.litt.in
సుప్రసిద్ధ సినీకవి వేటూరి 79వ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని 29 జనవరి 2015న అనకాపల్లి లోని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ హల్లో వేటూరి పాటలపోటీ జరిగింది. ఈ కార్యక్రమంలో డా విష్ణు మూర్తి,గూటూరి,జి రంగబాబు, గట్టి బ్రహ్మాజీ  మొదగువారు పాల్గొన్నారు 

06 ACHARYA ATHREYA 17TH VARDHANTHI SABHA-13-9-2006-www.litt.in

ఆత్రేయ శిష్యుడు శ్రీ గురుచరణ్ ముఖ్య అతిథిగా వక్తగా ఆత్రేయ 17 వ వర్ధంతి సమావేశానికి విచ్చేశారు . విజయా రెసిడెన్సీ లో 13 సెప్టెంబర్ 2006 న జరిగిన కార్యక్రమంలో  శ్రీ పల్లి శేషగిరి రావు పాల్గొన్నారు .శ్రీ వేప పార్వతీశం మున్నగువారు పాల్గొని కవిని ఘనంగా సత్కరించారు . 

09 ACHARYA ATHREYA 88th JAYANTHI SABHA-7-5-2009-www.litt.in
 ఆత్రేయ 88వ జయంతి సమావేశం 7 మే 2008 న అనకాపల్లి లోని   బషో కాన్ఫరెన్స్ హల్లో జరిగింది. శ్రీ తమ్మన సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ సభ్యులు గట్టి బ్రహ్మాజీ , జి రంగబాబు,మాధవీ  

సనారా ,డా యిమ్మిడిశెట్టి చక్రపాణి, మల్లారెడ్డి శంకర్ ప్రసాద్ మొదగువారు పాల్గొన్నారు  

12 ACHARYA ATHREYA 23rd VARDHANTHI SABHA-13-9-2012-www.litt.in
  ఆత్రేయ 23వ వర్ధంతి సమావేశం 13 సెప్టెంబర్ 2012 న అనకాపల్లి లోని శాఖా గ్రంధాలయంలో జరిగింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ కన్నయ్య శెట్టి ఆత్రేయ చిత్రపటానికి పూలమాల అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు . సంస్థ సభ్యులు గట్టి బ్రహ్మాజీ , అమరజ్యోతి ,సన్నికంటి ,దివాకరరావు , చక్రపాణి పాల్గొన్నారు 
15 ARUDRA 89th JAYANTHI-31-8-2014-www.litt.in
  సుప్రసిద్ధ సినీకవి ఆరుద్ర  89 వ జయంతి కార్యక్రమం 31 ఆగస్ట్ 2014న అనకాపల్లి లోని బి.ఎం.ఎల్. స్కూల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో గట్టి బ్రహ్మాజీ ,సన్నికంటి ,జి రంగబాబు, ఇవటూరి గౌరీశం,తాడి చక్రవర్తి  మొదగువారు పాల్గొన్నారు 
18 ACHARYA ATHREYA 92nd JAYANTHI SABHA 7-5-2015-www.litt.in
  ఆత్రేయ 94వ జయంతి సమావేశం 7 మే 2015 న అనకాపల్లి లోని ఒక గృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు జి రంగబాబు , బ్రహ్మాజీ, తెలుగు టీచర్, బ్యాంక్ ఉద్యోగి  మొదలగువారు పాల్గొన్నారు.