Indian Haiku Club

01) ఇండియన్ హైకూ క్లబ్ ఏర్పాటు నేపథ్యం :
ఇండియన్ హైకూ క్లబ్ కు సాహితీ సాంస్కృతిక సేవారంగాలలో  విశిష్ట స్థానం ఉంది . సాహిత్య కార్యక్రమాల నిర్వహణ , సమాజ ప్రయోజనం , సాహిత్య ప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది . ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డా . తలతోటి పృథ్వి రాజ్ గారి వ్యవస్ధాపకత్వంలో స్థాపించినదే ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సాంస్కృతిక సంస్థ .
ఉద్యోగరీత్యా పృధ్విరాజ్ అనకాపల్లికి వచ్చేనాటికి వెన్నెల, చినుకులు అనే రెండు haiku సంపుటాలను వెలువరించారు. ఆ తర్వాత వసంతం రోజుకో సూర్యుడు అనే మరో మూడు హైకూ సంపుటాలను వెలువరించారు. హైకూలను  మాత్రమే రాయడం గాక అనకాపల్లి లోని కవులనేకులు ఈ ప్రక్రియను అనుసరించి హైకూ సంపుటాలను వెలువరించాలనే ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా హైకూ సంకలనానికి పూనుకున్నారు పృద్వి రాజ్.
తెలుగు సాహిత్యంలో వెలువడిన తొలి హైకూ సంకలనంగా “నెలవంక” హైకూ కవితా సంకలనాన్ని పేర్కొనాలి.  పృథ్విరాజ్ గారు శ్రీయుతులు గణపతిరాజు  చంద్రశేఖరరాజు, మాధవి సనారా , ఇమ్మిడిశెట్టి చక్రపాణి, పినాకిని ,ఆచార్య గణపతిరాజు నరసింహ రాజు, జి రంగబాబులను కలుపుకొని ఏప్రిల్ 2002లో “నెలవంక” అనే తొలి హైకూ సంకలనాన్ని హైకూ క్లబ్ పబ్లికేషన్ పేరుతో ఇండియన్ హైకూ క్లబ్ ప్రచురణగా తీసుకువచ్చారు .
02) ఇండియన్ హైకూ క్లబ్ లక్ష్యాలు:
 ఇతర ప్రక్రియల్లో కవిత్వ రచన అనుసరిస్తున్న కవులకు హైకూ ప్రక్రియగూర్చి తెలియజేసి వారు కూడా ఆ ప్రక్రియలో మంచి రచనలు చేసేలా కృషి చేయడానికి ఇండియన్ హైకూ క్లబ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంది. ఉత్తమ హైకూ కవులను ప్రోత్సహించడం కోసం హైకూ అవార్డును ప్రకటిస్తుంది. ఒకరి హైకూలు మరొకరికి వినిపించడం ద్వారా హైకూ రచనలో మెళకువలు తెలుసుకోడానికి హైకూ కవి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. యువకవులను ప్రోత్సహించడం కోసం హైకూ సంకలనాలు ప్రచురించింది, మాస పత్రికలను తీసుకువచ్చింది.  సంవత్సరానికి ఒకసారి హైకూ వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది.  మొత్తం మీద హైకూ పరివ్యాప్తికి, హైకూ కవుల్ని  తయారు చేయాలనే లక్ష్యంతో హైకూ క్లబ్ పని చేస్తుంది.
03) ఇండియన్ హైకూ క్లబ్ కార్యవర్గ సభ్యులు:
2002లో ఏర్పాటైన సాహితీ సంస్థ ఇండియన్ హైకూ క్లబ్. హైకూ కవులు  కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇతర దేశాలలోని హైకూ కవులను కూడా కార్యవర్గంలో నియమించుకుంటుంది. సంవత్సరానికి 20 కార్యక్రమాలకు పైగానే సాహితీ సమావేశాలు ఏర్పాటు చేసింది.
04) ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సమావేశాలు:
 2002లో ఇండియన్ హైకూ క్లబ్ స్థాపించింది మొదలుకొని 2010 వరకు సుమారు 70 కార్యక్రమాలు నిర్వహించింది. పుస్తకావిష్కరణలు,  కవిసమ్మేళనాలు, పుస్తక ఆడియో-వీడియో ప్రదర్శనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, జాతీయస్థాయి హైకూ సెమినార్, అంతర్జాతీయహైకూ  కవిత్వంపై సదస్సులు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.  శ్రీ గణపతిరాజు చంద్రశేఖర రాజు గారి “మాధవి” హైకూ సంపుటి ఆవిష్కరణ తోనే హైకూ క్లబ్ తొలి సమావేశం ప్రారంభమైంది.
05) ఇండియన్ హైకూ క్లబ్ సెమినార్స్:
ఇండియన్ హైకూ క్లబ్ జాతీయస్థాయి సెమినార్లను నిర్వహిస్తోంది. హైకూలలో సుప్రసిద్ధ విమర్శకులచే వివిధ అంశాలపై మాట్లాడించి హైకూ ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తూ సెమినార్ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నిర్వహిస్తోంది.  28 మే 2006న ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించిన జాతీయ స్థాయి హైకూ సెమినార్ మరువలేనిది.  జాతీయ స్థాయి సెమినార్లు మాత్రమే కాకుండా రాష్ట్రస్థాయి లో  సెమినార్లు నిర్వహిస్తోంది.
06) ఇండియన్ హైకూ క్లబ్ కవిసమ్మేళనాలు:
హైకూలు రాసే కవులందరినీ ఒక చోటికి చేర్చి ఒకరి భావాలు ఒకరు పంచుకోవడమే ఈ హైకూ కవి సమ్మేళనం లక్ష్యం. కవి సమ్మేళనంలో ఉత్తమ హైకూలు చదివిన వారికి బహుమతి ప్రదానం కూడా చేస్తుంది హైకూ క్లబ్ . 2010లో అద్భుతంగా ఉగాది హైకూ కవిసమ్మేళనంను  ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించింది.
07) ఇండియన్ హైకూ క్లబ్ పుస్తకావిష్కరణలు:
 ఇండియన్ హైకూ క్లబ్ వేదికగా ఇప్పటివరకు సుమారు 15కు పైగా పుస్తకావిష్కరణ, 10వరకు సీడీ ఆవిష్కరణలు జరిగాయి.  చక్కని పుస్తక సమీక్ష లతో హైకూ రచనలోని లోటుపాట్లను కవికి సమీక్షల ద్వారా తెలియజేస్తూ మంచి హైకూ సంపుటాలు రావడానికి హైకూ క్లబ్ ప్రయత్నిస్తుంది
08) ఇండియన్ హైకూ క్లబ్ పుస్తక, వీడియో-ఆడియో సిడిలు ప్రదర్శనలు:
ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించే సమావేశాలలో తెలుగు హైకూ సంపుటులనే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన హైకూ కవుల కవితా సంపుటాలను కూడా ప్రదర్శిస్తోంది.  వివిధ దేశాల నుండి వెలువడే హైకూ పత్రికలను ప్రదర్శిస్తుంది.  ఇండియన్ హైకూ క్లబ్ పేరుతో డా.తలతోటి పృథ్వీ రాజ్ ఆడియో వీడియో సీడీల  ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి.
09) ఇండియన్ హైకూ క్లబ్ హైకూ పత్రిక:
 ఇండియన్ హైకూ క్లబ్ ప్రచురణ గా హైకూ పత్రికను, న్యూస్ లెటర్ ను, హైకూ సంకలనాలను తీసుకువస్తోంది. తొలి సంకలనంగా “నెలవంక” ఆ తర్వాత “సంబోధి” అటు తర్వాత జాతీయ స్థాయిలో “అరటి కుటీరం” అనే హైకూ సంకలనాలను ఇండియన్ హైకూ క్లబ్ ప్రచురించింది. ఇండియన్ హైకూ క్లబ్ ఆన్ లైన్ హైకూ మాగజైన్ కూడా నిర్వహించే ఆలోచనలో ఉంది.
10) ఇండియన్ హైకూ క్లబ్ ఆడియో-వీడియో సీడీలు:
ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ఎన్నో సాహితీ ఆడియో వీడియో సీడీలను తన వ్యాఖ్యానంతో రూపొందించారు.  వీరు రూపొందించిన హైకూ కవిత్వం వీడియో ఫైల్స్ యూట్యూబ్ వెబ్ సైట్ లో  అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు.
11) ఇండియన్ హైకూ క్లబ్ అవార్డులు, పురస్కారాలు, బిరుదులు ప్రదానాలు :
ఇండియన్ హైకూ క్లబ్ అవార్డులను, పురస్కారాలను, బిరుదులను అర్హులైన కవులకు, విమర్శకులకు, సాహితీ వేత్తలకు ప్రదానం చేస్తుంది.  2005లో నానీ అవార్డు ను డాక్టర్ ఎస్.  రఘుకి , 2003లో శ్రీమతి యడవల్లి రత్నమాలకు , “హైకూ సారస్వతం” అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించిన డాక్టర్ రూప్ కుమార్ గారికి ఉగాది సాహితీ పురస్కారాన్ని క్లబ్ ప్రదానం చేసింది.  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు  డాక్టర్ కె.  శివారెడ్డి , డాక్టర్ ఎన్.గోపి గార్లకు ఇండియన్ హైకూ క్లబ్ “కవిత ప్రపూర్ణ” బిరుదు ప్రదానం చేసింది.
ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థ “ఆత్రేయ సాహితీ స్రవంతి” ద్వారా తెలుగు సినిమా పాటల రచయిత శ్రీ జాలాది గారికి “జానపద గేయ శిరోమణి” బిరుదు ప్రదానం చేసింది. ఆత్రేయ శిష్యుడు శ్రీ గురుచరణ్ కు “ఆత్రేయ సాహితీ పురస్కారాన్ని” ప్రదానం చేసింది.  ప్రతి ఇతర రాష్ట్రాలలో , ఇతర దేశాలలో హైకూ రచనలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు పత్రాన్నిఅందించాలని హైకూ క్లబ్ భావిస్తుంది .
12) ఇండియన్ హైకూ క్లబ్ వెబ్ సైట్ :
ఇండియన్ హైకూ క్లబ్ ఆంధ్రదేశంలోని తెలుగువారికి భారతదేశంలోని ఇతరులకు దగ్గరవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హైకూ కవులకు దగ్గరవాలని ,  వారి హైకూ కవిత్వం తో క్లబ్ సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసి వెబ్ సైట్ కొరకు ప్రయత్నిస్తుంది . ఈ వెబ్ సైట్  ద్వారా తెలుగు భాషలో, భారతదేశంలోని ఇతర భాషల్లో జరుగుతున్న హైకూ సాహిత్య కృషిని ఇతర దేశాలకు చాటి చెప్పడమే కాకుండా ఇతర దేశీయుల హైకూ కవిత్వాన్ని భారతీయులు,  తెలుగు వారు తెలుసుకునే అనుబంధాన్ని కలిగి ఉండాలని హైకూ క్లబ్ వెబ్ సైట్ రూపొందించుకుంటుంది.
12) ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థ ఆత్రేయ సాహితీ స్రవంతి:
ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థగా ఆత్రేయ సాహితీ స్రవంతి ఏర్పడింది. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆత్రేయ బ్లాగ్ ను నిర్వహిస్తుంది . ప్రతి సంవత్సరం ఆత్రేయ జయంతి-వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఇతర సినీ కవుల సాహిత్యం మీద కూడా సమావేశాలు నిర్వహిస్తోంది .
13) ఇండియన్ హైకూ క్లబ్ సభ్యత్వం , పోషకులు:
ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సంస్థగా నడవాల్సిన సంస్థ. కాని చాలా వరకు తన వ్యక్తిగత ధనాన్ని సంస్థ కార్యక్రమాలకు వ్యవస్థాపక అధ్యక్షులు వెచ్చించి నిర్వహిస్తున్నారు.  అయితే ఈ సాహిత్య కార్యక్రమంలో కొందరు కొంతమేరకు సంస్థకు వారి ఆర్ధిక తోడ్పాటునందించారు.  వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు! సంస్థ చేపట్టిన,  నిర్వహిస్తున్న అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి సభ్యత్వాన్ని వసూలు చేస్తుంది.
INDIAN HAIKU CLUB LOGO

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam eu hendrerit nunc. Proin tempus pulvinar augue, quis ultrices urna consectetur non.

Telugu Haiku Books And Poets

  • AKASAM NELAPALAINADI-BHAVACHITHRALU-HAIKU CLUB
  • ARATI KUTEERAM-MOODU BINDUVULU-HAIKU CLUB
  • ARAVAIRELLA 120-DRUSYAA DRUSHYAM-HAIKU CLUB
  • BANTHIPOOLU-AKASA DEEPALU
  • CHIGURUKALA-CHAITHANYA LOLAKAM
  • CHILAKALA SANTHAKAM-SAMPENGALOLAKAM-HAIKU CLUB
  • CHINUKULA CHITHRALU-SULOCHANAALU-HAIKU CLUB
  • HAIKOOLU-DASTHAKHATH
  • KAPPALA NISHABDHAM-NATTHA PRANAYA YATHRA-HAIKU CLUB
  • KAVITALATHOTI-PRITHVI SENRYU-HAIKU
  • KONETI POOLU-NADICHE SAVALU
  • MADHAVI-MADHURI-HAIKU CLUB
  • MAREDU DALAM-SANDEGUMMAM-HAIKU CLUB
  • MUNJANTHA MRUDUVAINA HAIKU-DIGULU VARNALU
  • OORU YERU YENNELA-SAMAJIKA HAIKOOLU
  • POOLA CHINUKULU-GARIKA POOLU
  • PULURALAAYI-HAIKU-CLUB
  • PUNNAMI-RAYANCH SATHAKAM-HAIKU CLUB
  • RANGULA NIMGI-INDIAN HAIKU CLUB
  • SANGATHYAM-KOTTHA VAANA-HAIKU CLUB
  • SEETHAKOKA CHILUKA-HARIVILLU
  • TALATHOTI PRITHVI RAJ's  CHANDRAKIREETI & RUTHUBRAHMANAM HAIKU POETRY BOOK
  • TALATHOTI PRITHVI RAJ's  COMPILATED HAIKU POETRY BOOKS NELAVANKA & SAMBODHI
  • TALATHOTI PRITHVI RAJ's  KALUVALU & NEELAAKAASAM HAIKU POETRY BOOKS
  • TALATHOTI PRITHVI RAJ's  PRITHVI TANKALU & MADHAVI SANARA's SANARA TANKALU POETRY BOOKS
  • TALATHOTI PRITHVI RAJ's  VASANTHAM & CHINUKULU HAIKU POETRY BOOKS
  • TALATHOTI PRITHVI RAJ's  VENNELA & ROJUKO SURYUDU HAIKU BOOKS
  • VARSHA SANGEETHAM-HAIKOO CHITHRALU
  • VEKUVA PITTA-PODDU PUSINDI-HAIKU CLUB
  • VENNELAGAA UNDI-VENNELA RATHRI
  • YETIVADDUNA PRAYANAM-CHOORU-HAIKU CLUB

  • Addepalli Jyothi
  • B.V.V.Prasad
  • Bhagvan
  • Bojanki Venkata Ravi
  • Bollimuntha Venkata Ramana Rao
  • Dabbekar Roopkumar
  • Dake Akshok Kumar
  • Emmidisetti Chakrapani
  • G.Ranaga Babu
  • Gali Nasara Reddy
  • Ganapathiraju chandrashekara Raju
  • Ismail
  • K.Ramachanda Reddy
  • L.Venkateswarlu
  • Lakuma
  • M.Rama Appa Rao
  • Makineedi Surya Bhaskar
  • Nelapuri Rathnaji
  • P.Lakshman Rao
  • P.R.L.Swamy
  • P.Srinivas Goud
  • Patthipaka Mohan
  • Penna Sivarama Krishna
  • Sanara
  • Sankara haiku poet
  • Sasri
  • Shekara Manthri Prabhakar Rao
  • Sikha Akash - Katthula Kishore
  • Sireesha
  • Talathoti prithvi raj
  • TELUGU HAIKU POETS-26
  • TELUGU HAIKU POETS-27
  • TELUGU HAIKU POETS-28
  • TELUGU HAIKU POETS-29
  • TELUGU HAIKU POETS-30
  • TELUGU HAIKU POETS-31
  • Vasudha Basaveswara Rao
  • Vempalli Sivaprasad
  • Y.Rathnamala

Indian Haiku Club Patrons, Speakers, Award Winners

  • INDIAN HAIKU CLUB PATRON-B.BANGARRAJU
  • INDIAN HAIKU CLUB PATRON-G.RAMESH GUPTHA
  • INDIAN HAIKU CLUB PATRON-RAPARTHI JAGADEESH
  • INDIAN HAIKU CLUB PATRON-S.HANUMANTHARAO
  • INDIAN HAIKU CLUB PATRON-SRINUREDDY-ANAKAPALLI

  • INDIAN HAIKU CLUB SPEAKER - ADDEPALLI RAMA MOHANA RAO
  • INDIAN HAIKU CLUB SPEAKER - B.V.BANGARRAJU
  • INDIAN HAIKU CLUB SPEAKER - CHALASANI PRASADA RAO
  • INDIAN HAIKU CLUB SPEAKER - DASYAM SENADHIPATHI
  • INDIAN HAIKU CLUB SPEAKER - Dr.N.GOPI
  • INDIAN HAIKU CLUB SPEAKER - Dr.RAVURI BHARADWAJA
  • INDIAN HAIKU CLUB SPEAKER - DWANA SASTHRI
  • INDIAN HAIKU CLUB SPEAKER - ENDLURI SHUDHAKAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - GURUCHARAN
  • INDIAN HAIKU CLUB SPEAKER - ICHHAPURAPU RAMACHANDRAM
  • INDIAN HAIKU CLUB SPEAKER - JAGADDATHRI
  • INDIAN HAIKU CLUB SPEAKER - JALADI
  • INDIAN HAIKU CLUB SPEAKER - JWALAMUKHI
  • INDIAN HAIKU CLUB SPEAKER - K.SIVA REDDY
  • INDIAN HAIKU CLUB SPEAKER - KADIYALA RAMMOHAN ROY
  • INDIAN HAIKU CLUB SPEAKER - KOVELA SUPPRASSANNA CHARYA
  • INDIAN HAIKU CLUB SPEAKER - MAKINEEDI SURYABHASKAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - NALIMELA BHASKAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - PEDDIBOTLA SUBBARAMAYYA
  • INDIAN HAIKU CLUB SPEAKER - PEDDINTI ASHOKKUMAR
  • INDIAN HAIKU CLUB SPEAKER - RAMATHEERTHA
  • INDIAN HAIKU CLUB SPEAKER - RENTALA VENKATESWARLU
  • INDIAN HAIKU CLUB SPEAKER - TANGIRALA VENKATA SUBBA RAO
  • INDIAN HAIKU CLUB SPEAKER - V.KRANGA RAO

  • INDIAN HAIKU CLUB AWARD WINNER - ADDEPALLI RAMAMOHAN RAO
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - BHAGWAN
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - DABBIKAR ROOPKUMAR
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - Dr.NALIMELA BHASKAR
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - Dr.S.RAGHU
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - G.SANARA
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - KONDREDDY VENKATESWARAREDDY
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - KOPURI PUSHPA DEVI
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - P.LAKSHMAN RAO
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - Prof VELAMALA SIMMANNA
  • INDIAN HAIKU CLUB AWARD WINNER - YEDAVALLI RATHNAMALA

INDIAN HAIKU CLUB LITERARY PROGRAMMES

  • Indian Haiku Club Literary Meatings
  • 2010 IHC UGADI PURASKARALU-
  • 2010 IHC UGADI PURASKARAmTO ROOPKUMAR
  • 2010 NAANELU AWARD WINNERS
  • 2010 NAANELU AWARDS
  • ADUGULU PRITHVI'S NAANEE POETRY BOOK RELEASE FUNCTION
  • AMBALLA SAHITHYA SABHA
  • ANDAMAAN TRAVELOGUE SADASSU
  • ARATIKUTEERAM HAIKU COMPILATION  BOOK RELEASE FUNCTION
  • BASHO 313rd  VARDHANTHI
  • BASHO 314th VARDHANTHI SABHA
  • BASHO CONFERENCE HALL OPENING BY RAPARTHI JAGADEESH
  • BASHO CONFERENCE HALL OPENING
  • BHARADWAJA UPANYASA SABHA
  • CHANDRA KIREETI(HAIKU BOOK) RELEASE FUNCTION
  • CHATUVULU-CHAMATHKAARAALU SPEACH BY PARVATEESAM
  • Dr.G.BASAVVESWARA RAO SPEACH ON TATHVIKA CHINTHANA
  • DWANA FELICITATED BY INDIAN HAIKU CLUB
  • FELICITATION TO Dr.N.GOPI BY Dr.TALATHOTI PRITHVI RAJ
  • FELICITATION TO ENDLURI BY INDIAN HAIKU CLU AT NAANEELU AWARDS
  • FELICITATION TO K.SIVAREDDY BY IHC MEMBERS
  • FELICITATION TO TANGIRALA SUBBA RAO
  • GANNU KRISHNA MURTHI
  • HAIKU AVAGAHANA SADASSU
  • HAIKU POETS GROUP PHOTO AT INDIAN HAIKU CLUB SEMINAR
  • IHC 2004 HAIKU REWARD-AWARD FUNCTION
  • IHC 2005 NAANEE AWARD TO Dr.S.RAGHU
  • IHC 2005 NAANEE AWARD TO Dr.S.RAGHU-
  • INDIAN HAIKU CLUB MEMBERS-POETS
  • INDIAN HAIKU CLUB SEMINAR-01
  • INTRODUCTION OF  VAK RANGA RAO by CHAKRAPANI
  • ISMAIL MEETING -CONDOLENCES BY IHC MEMBERS
  • J.M.NAIDU SAAHITEE PURASKARAM TO BHAGWAN
  • J.M.NAIDU SAAHITEE PURASKARAM TO BHAGWAN-
  • J.VIDHYULATHA JAYANTHI SABHA
  • JWALAMUKHI SADASSU-
  • KANDUKURI JAYANTHI SABHA
  • KARIMULLA SPEACH ON ISLAMVAADA SAHITHYAM
  • KOVELA SUPRASANNACHARYA-RENTALA SPEACHES
  • MADHAVI HAIKU BOOK RELEASE FUNCTION
  • MALLA RAMA APPA RAO SAHITHYA SAMALOCHANA SABHA
  • MATHRUBHASHA DINOSSAVAM
  • MEETING ON PAUL DAVID MENA HAIKU POETRY
  • memonto to jwalamukhi
  • MINERWA T.BLOOM-ADDRESSING HAIKU CLUB PRESIDENT
  • PADYAMANJOOSH,SAMVEEKSHANA-AUDIO C.D.-MAGAZINE RELEASE FUNCTION
  • PEDDIBOTLA SUBBARAMAYYA FELICITATED BY INDIAN HAIKU CLUB
  • PEDDIBOTLA SUBBARAMAYYA SPEACH ON STORIES
  • POETRY WORKSHOP BY ADDEPALLI
  • PRABHANDHA CHAMATHKAARAALU-BOOK RELEASE FUNCTION
  • PRITHVI PHOTO HAIKU VIDEO C.D. RELEASE by SRINUREDDY
  • PRITHVI'S PHOTO HAIKU BOOK RELEASE FUNCTION
  • ROKKAM RADHAKRISHNA SAAHITEE PURASKARAM TO SIMMANNA
  • ROKKAM RADHAKRISHNA SAAHITEE PURASKARAPATHRAM TO SIMMANNA-
  • SAMBBODHI HAIKU COMPILATION RELEASE
  • SAMBBODHI HAIKU COMPILATION RELEASE-
  • SANKRANTHI SAHITHEE PURASKARAM TO ADDEPALLI
  • sanmanapathram
  • SCHOOL CHILDRENS WITH BHARADWAJA
  • SIRA GHAZAL AUDIO C.D. RELEASE FUNCTION
  • SIRA GHAZAL NIGHT BY PRADANA ADINARAYANA
  • SPEACH ON STORIES by ICHAPURAPU
  • SRI SRI 21st VARDHANTHI SABHA
  • SRI SRI 23rd VARDHANTHI SABHA
  • TANKA BOOK RELEASE BY Dr.S.HANUMANTHA RAO
  • UGADI  2007
  • VEMANA PADYALALO STHREE-AUDIO CASATE RELEASE FUNCTION