kavitalathoti

All Rounder

ఈ జీవితం దేవుడిచ్చిన వరం. జ్ఞానమే ఆ వరం. చదువే ఆ జ్ఞానం. అటువంటి చదువుల్ని వారి స్తోమతకు మించి చదివించిన నా తల్లిదండ్రులకు, మరిముఖ్యంగా నా తండ్రి కీ.శే. తలతోటి సత్యానందం ఋణం తీర్చుకోలేనిది. ఊహ తెలిసింది మొదలు నా జీవిత ప్రవాహం నాముందు ప్రవహిస్తూనే ఉంది. కవిగా “కవితలతోటి” నా భావనలు, అనుభూతులు అనంతం.

Kavitalathoti

KAVITALATHOTI-300
KAVITALATHOTI----300

Work is Worship

నా వృత్తి , నా ప్రవృత్తికి చాలా దగ్గ్గరి సంబంధం. సాహిత్యమే కేంద్ర బిందువు.  విద్యార్థులను తీర్చిదిద్దగలిగే అదృష్టం ఈ లోకంలో ఒక్క టీచర్స్ కు మాత్రమే ఉంది. ఉన్న అసంతృప్తి మాత్రం నేటి చాలామంది విద్యార్థులు తత్వమే!. సరదాలు కాకుండా శ్రమ పడాలని, జీవిత లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టు వదలకూడదనే ఆలోచనలేని విద్యార్థులను చూస్తున్నప్పుడు బాధ. వీలుకుదిరిన ప్రతి సందర్భంలో అధ్యాపకునిగా పాఠ్యాంశాలనే గాక, జీవిత పాఠాలనూ బోధిస్తూ ఉంటాను. వృత్తిపట్ల నిబద్ధత ఉంది.

As a Professor

My literary journey 

చిన్నప్పుడు నేను గ్రంథాలయానికి వెళ్ళే  అలవాటు నన్ను కవిగా చేసింది. విజ్ఞానవంతునిగా మార్చింది. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టింది. కవిగానేగాక సాహితీ సంస్థల వ్యవస్థాపకునిగా,  సాహిత్య కార్యక్రమాల నిర్వాహకునిగా ఎన్నో అనుభవాలు. సాహిత్య లోకంలో చెప్పుకోదగిన ఎన్నో విషయాలు. నాకైతే ముఠాలు లేవు. సాహిత్యాన్నే చూసి అనేకుల కవిత్వాన్ని  అనేక వేదికలమీద చాటాను, ఊరేగించాను. అందమైన దృశ్య చిత్రాలుగా మలిచాను. అనేకులను సన్మానించాను, ప్రోత్సహించాను. వీలున్న చోట సవివరంగా అనుభవాలను పంచుకుంటాను.

Multi talented person
TALATHOTI PRITHVI RAJ-KAVITALATHOTI