Organizations

       మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలలోను , ఇతర దేశాలలోను ఎన్నో సాహితీ సాంస్కృతిక సంస్థలు సాహిత్యము ,కళలపై ఉన్న అభిరుచి కొద్ది , వారి శక్తి మేరకు ఎంతో ఆసక్తితో పనిచేస్తున్నాయి . చాలామంది  జేబుల్లోని డబ్బును సాహితీ సమావేశాలకు ఖర్చుచేస్తూ నిర్వహిస్తున్నారు . సంస్థలెన్నున్నా చాలామంది నామమాత్రంగా , హోదా కొరకే ఉంటారు . కీలకమైన ఒకరిద్దరి భుజస్కంధాలపై మాత్రమే సంస్థ కార్యకలాపాలు సాగుతుంటాయి అన్నది నిజం . నిజానికి సాహితీ సంస్థలకు కూడా ప్రభుత్వం చేయూతని అందిస్తే వాటివంతు పాత్ర అవి నిర్వహిస్త్తాయి . ఒకరో ఇద్దరో ఏదో ఓ సందర్భంలో ఆర్థిక తోడ్పాటును అందిస్తూ సహకరించే సాహితీ పోషకులు అక్కడక్కడ ఉన్నారు తప్పించి అన్ని కార్యక్రమాలు వారి ప్రోత్సాహంతోనే సాగుతాయనుకోవడం అవగాహనలేమి . 
       ఔత్సాహిక కవులు రచయితలు రచించి ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలన్న , ఏదో ఒక సందర్భంలో తన కవిత్వాన్ని , సాహిత్యాన్ని పదుగురుతో సభల్లో పంచుకోవాలన్న సాహిత్య సమస్త తోడ్పాటు అవసరం .నేడు  ప్రసిద్ధులైన అనేకులకు ఎన్నో సంస్థలు ఈ రకమైన ఊతాన్ని ఇచ్చినవే . సాహితీ సాంస్కృతిక సంస్థలు ఔత్సాహికులను ప్రోత్సహించే ప్రయత్నంలో పోటీలు నిర్వహించుట , సన్మాన సత్కారాలు , పురస్కారాలను అందిస్తూ మరింత బాధ్యతతో , సామాజిక బాధ్యతగా కవులు రచయితలు సాహిత్య సృజన చెయ్యడానికి ప్రధాన కారణభూతమయ్యేవి సాహితీ సంస్థలే !

       సాహిత్య సాంస్కృతిక రంగాలలో ఎంతో కృషి చేస్తున్న సాహితీ సంస్థల గూర్చి సంక్షిప్తంగా పరిచయం చేయాలన్నదే ఈ ఈ వెబ్ సైట్ నిర్వాహకుల ముఖ్య ఉద్దేశ్యం .